జయఘ్యశ పేట ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి
అమరావతి, 25 నవంబర్ (హి.స.):జగ్గయ్యపేట ఆర్టీసీ బస్టాండ్‌లో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లపై దాడికి పాల్పడినందుకు గానూ.. డ్రైవర్లంతా మూకుమ్మడిగా నిరసనకు దిగారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో డ్రైవర్‌పై ఓ రౌడీ షీటర్ దాడి
జయఘ్యశ పేట ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి


అమరావతి, 25 నవంబర్ (హి.స.):జగ్గయ్యపేట ఆర్టీసీ బస్టాండ్‌లో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లపై దాడికి పాల్పడినందుకు గానూ.. డ్రైవర్లంతా మూకుమ్మడిగా నిరసనకు దిగారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో డ్రైవర్‌పై ఓ రౌడీ షీటర్ దాడి చేశాడు. మరోవైపు ఆర్టీసీ డిపోలో మరో డ్రైవర్‌పై కొందరు ఆటో డ్రైవర్లు దాడికి పాల్పడ్డారు. బాధిత డ్రైవర్లకు మద్దతుగా హైర్ బస్ ఓనర్లు, ఆర్టీసీ కార్మికులంతా బస్సులు సర్వీసులు నిలిపివేసి నిరసనకు దిగారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande