
అమరావతి, 25 నవంబర్ (హి.స.)మలేషియా పరిసర ప్రాంతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. ఇవాళ దక్షిణ అండమాన్‌లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆపై 48 గంటల్లో వాయుగుండం బలపడుతుందన్నారు. దక్షిణ బంగాళాఖాతంలో తుఫాన్‌గా మారే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ క్రమంలోనే దక్షిణ కోస్తాలో మత్స్యకారులు స్వస్థలాలకు తిరిగి వెళ్లాలని సూచించారు.
ఈ నెల 29వ తేదీన.. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశంతొ పాటు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. అలాగే ఈ నెల 30వ తేదీ, డిసెంబర్ 1న కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలోని చాలా చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV