
అమరావతి, 25 నవంబర్ (హి.స.):పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఏసీబీ కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. మద్యం కుంభకోణంలో నిందితుడుగా ఉన్న మిథున్‌రెడ్డి బెయిల్‌పై బయట ఉన్నారు. కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసే సమయంలో అనుమతి లేకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లరాదని షరతు పెట్టింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ