
విజయవాడ,:, 25 నవంబర్ (హి.స.)విజయవాడ సమీపంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో అరెస్టు చేసిన మావోయిస్టుల్లో కొందరిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఆయా కోర్టుల్లో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులో 18న నలుగురు మావోయిస్టులను... పొడియా బీమా అలియాస్ రంగు, మడకం లక్మ అలియాస్ మదన్, మడవి చిన్మయి అలియాస్ మనీలా, మంగి డొక్కుపాడిలను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారంతా ప్రస్తుతం నెల్లూరు కేంద్ర కరాగారంలో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వారిని ఏడు రోజులు కస్టడీకి ఇవ్వాలని పటమట పోలీసులు నాలుగో అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలంలో కానూరులోని కొత్త ఆటోనగర్‌లో పోలీసులకు చిక్కిన 28 మంది మావోయిస్టుల్లో ముగ్గురిని... ఉద్దే రఘు, ఓయం జ్యోతి, మడకం దివాకర్‌ను మూడు రోజుల కస్టడీకి ఇవ్వాలని పటమట పోలీసులు మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో సోమవారం పిటిషన్ వేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ