
హైదరాబాద్, 23 నవంబర్ (హి.స.)
భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్య సేన్ టైటిల్ దాహాన్ని తీర్చుకున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్ చాంపియన్స్ ఫైనల్ మ్యాచులో విజయం సాధించి తొలి టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఈ రోజు ఆదివారం సిడ్నీలో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో జపాన్ ప్లేయర్ యూషి తనాకాపై 21-15, 21-11తో ఘన విజయం సాధించాడు. పారిస్ ఒలింపిక్స్లో నాలుగో స్థానం తర్వాత కఠినమైన దశను ఎదుర్కొంటున్న 24 ఏళ్ల యువ ప్లేయర్ ఈ విజయంతో టైటిల్ గెలుచుకొని తన సత్తాను నిరూపించాడు. మొత్తం 38 నిమిషాల పాటు ఈ ఫైనల్ మ్యాచ్ జరగ్గా.. మొదటి క్షణం నుంచి లక్ష్య సేన్ త దూకుడు ప్రదర్శించాడు. ఈ విజయంతో టైటిల్ తో పాటు లక్ష్య సేన్ 4,75,000 డాలర్ల ప్రైజ్మనీ గెలుచుకున్నాడు. విజయానంతరం 'ఫింగర్స్ ఇన్ ఇయర్స్ సెలబ్రేషన్స్' చేస్తూ భావోద్వేగాన్ని వ్యక్తం చేశాడు. ఈ విజయంతో లక్ష్య సేన్ను తిరిగి ఫామ్లోకి అడుగుపెట్టాడనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు