
హైదరాబాద్, 23 నవంబర్ (హి.స.)
చండీగఢ్ చట్ట ప్రక్రియ సరళీకరణ
ప్రతిపాదనపై సోషల్ మీడియాలో అనేక వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ స్పందించింది. చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ చట్టం రూపొందించే ప్రక్రియను సరళీకరించాలన్న ప్రతిపాదనపై ఇంకా ఏదైనా తుది నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదన వల్ల చండీగఢ్ పరిపాలనా నిర్మాణం (Administrative structure of Chandigarh), పాలన విధానం లేదా పంజాబ్-హర్యానా రాష్ట్రాలతో ఉన్న సాంప్రదాయిక సంబంధాల్లో ఏ మార్పూ ఉండబోదని హోం శాఖ ప్రకటించింది. సంబంధిత పక్షాలందరితో సంపూర్ణంగా చర్చించిన తర్వాత మాత్రమే తగిన నిర్ణయం తీసుకుంటామని, ఈ విషయంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్రం హామీ ఇచ్చింది. రాబోయే పార్లమెంట్ వింటర్ సెషన్లో ఈ మేరకు ఎటువంటి బిల్లు ప్రవేశ పెట్టే ఉద్దేశం లేదని కూడా స్పష్టం చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..