హైదరాబాద్ గడ్డ మీద మువ్వెన్నల జెండా ఎగురుతుందంటే కారణం ఆయనే: కిషన్ రెడ్డి
హైదరాబాద్, 23 నవంబర్ (హి.స.) సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్లో యూనిటీ మార్చ్ నిర్వహించారు. ఈ మార్చ్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశ సమగ్రత, ఐక్యతను చాటడం కోసమే యూనిటీ
కిషన్ రెడ్డి


హైదరాబాద్, 23 నవంబర్ (హి.స.)

సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్లో యూనిటీ మార్చ్ నిర్వహించారు. ఈ మార్చ్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశ సమగ్రత, ఐక్యతను చాటడం కోసమే యూనిటీ మార్చ్ అన్నారు. సర్దార్ పటేల్ 150 జయంతి వేడుకలను కేంద్రం ఘనంగా నిర్వహిస్తోందని చెప్పారు. పటేల్ చొరవతోనే హైదరాబాద్ గడ్డపై మువ్వెన్నల జెండా ఎగిరిందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. తెలంగాణకు వల్లభాయ్ పటేల్ కంటే గొప్పవారు లేరని కొనియాడారు. పటేల్ ఆశయ సాధన, స్ఫూర్తితో మనం ముందుకు సాగాలని కోరారు. 536 సంస్థానాలను ఏకం చేసి అఖండ భారతావనిని నిర్మించిన మహనీయుడని అన్నారు. హైదరాబాద్ సంస్థానం విలీనంలో కూడా ఆయన పాత్ర అమోఘమని అన్నారు. మహనీయుల ఆశయాలకనుగుణంగా యువతరం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఐక్యత కోసం ప్రతిక్షణం పరితపించిన మహనీయుడు వల్లభాయి పటేల్ అని కొనియాడారు. ---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande