
జనగామ, 23 నవంబర్ (హి.స.)
స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతలో
భాగంగా, అలాగే స్వయం సహాయక సంఘాల సభ్యులకు యూనిఫామ్ చీరల పంపిణీ కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో వివిధ శాఖల అధికారులు విధుల్లో నిమగ్నమయ్యారు. ఈ కారణంగా సోమవారం నిర్వహించాల్సిన గ్రీవెన్స్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు