
హైదరాబాద్, 23 నవంబర్ (హి.స.)
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చక్రం తిప్పాలని భావించి చతికిలపడిన జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకులు ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మొన్నటి ఎన్నికల్లో ఎక్కడో తప్పు జరిగిందని సందేహం వ్యక్తం చేసిన ఆయన ఈ విషయాన్ని నిరూపించేందుకు తన వద్ద సరైన ఆధారాలు పెద్దగా లేవనన్నారు. తాజాగా ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ప్రజలకు పరిచయం అక్కర్లేని పార్టీలకు కూడా లక్షల ఓట్లు రావడంపై అనుమానాలు కలిగిస్తోందన్నారు. పోలింగ్కు ముందు తమ బృందం సేకరించిన ప్రజాభిప్రాయానికి, ఎన్నికల ఫలితాలకు అసలు సంబంధమే లేదని, బిహార్ ఫలితాలు ప్రజాభిప్రాయానికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయని ఆరోపించారు. తమ పార్టీ ఒక్క సీటు కూడా గెలవకపోవడం బాధ కలిగించిందన్నారు. అయితే ఈ ఓటమితో తన పొలిటికల్ కెరీర్ ముగియలేదని వచ్చే ఐదేళ్లు బిహార్ లోనే ఉంటానని ప్రజల్లోకి మరింత బలంగా వెళ్తానన్నారు. ఈవీఎంలు తారుమారు చేశారని చెప్పాలని కొందరు నన్ను అడుగుతున్నారు. అయితే ఓడిన తర్వాతచేసే ఆరోపణలు ఇవేనన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు