ఇంకొంత సమయం ఇవ్వండి.. స్పీకర్కు దానం నాగేందర్ లేఖ
హైదరాబాద్, 23 నవంబర్ (హి.స.) స్పీకర్ నోటీసులపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎట్టకేలకు స్పందించారు. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు లేఖ రాశారు. వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. స్పీకర్ ఇచ్చిన గడువు ముగియంతో తాజ
ఎమ్మెల్యే దానం


హైదరాబాద్, 23 నవంబర్ (హి.స.)

స్పీకర్ నోటీసులపై ఖైరతాబాద్

ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎట్టకేలకు స్పందించారు. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు లేఖ రాశారు. వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. స్పీకర్ ఇచ్చిన గడువు ముగియంతో తాజాగా లేఖ ద్వారా రెస్పాండ్ అయ్యారు. మరోవైపు ఫిరాయింపుల చట్టం కింద చర్యలకు అవకాశం ఇవ్వకుండా.. ముందుగానే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని పెద్దఎత్తున ప్రచారం సాగుతోంది. గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫాంపై దానం పోటీ చేసినందున పార్టీ మారినట్లు ఆధారాలున్నాయని, రాజీనామా చేస్తేనే వేటు తప్పుతుందని నేతలు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే శ్రీధర్ బాబును కలిసి ఆయన చర్చించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పంచాయతీ ఎన్నికలు వస్తున్నందున వాటి తర్వాతే దానం రాజీనామా ఉంటుందనే ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా తప్పనిసరైతే తదుపరి చర్యలు, ప్రత్యామ్నాయం ఏమిటనే అంశాలపైనా దానం దృష్టి సారించినట్లు సమాచారం.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande