మహారాష్ట్ర దేశీ దార్ మద్యాన్ని పట్టుకున్న మంచిర్యాల పోలీసులు
మంచిర్యాల, 23 నవంబర్ (హి.స.) మహారాష్ట్ర కి చెందిన దేశీ దార్ మద్యం పట్టివేసిన ఘటన మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండల పరిధిలో చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలం పరిధిలోని పారుపల్లి చింత వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ నిర్వహ
మంచిర్యాల పోలీస్


మంచిర్యాల, 23 నవంబర్ (హి.స.)

మహారాష్ట్ర కి చెందిన దేశీ దార్ మద్యం పట్టివేసిన ఘటన మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండల పరిధిలో చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలం పరిధిలోని పారుపల్లి చింత వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో మహారాష్ట్ర నుంచి అక్రమంగా ఇద్దరూ వ్యక్తులు సోదరీ సంజీవ్, అమరాజీ 400 దేశీ దార్ మద్యం బాటిళ్లను తరలిస్తుండగా పట్టుకున్నారు. వీరిద్దరూ మహారాష్ట్రలోని సిరోంచ తాలూకా కి చెందిన వారు అని ఎస్సై తెలిపారు. వీటి విలువ సుమారు రూ.24వేల వరకు ఉంటుందని అంచనా ఉంటుందని ఎస్సై రాజేందర్ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande