
హైదరాబాద్, 23 నవంబర్ (హి.స.)
నాకు అక్క చెల్లె ఉన్నారు.. మా
ఆడబిడ్డలతో సమానంగా మిమ్మల్ని చూసుకుంటా... మీకు ఏ కష్టం రానివ్వను అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం కోహెడ మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు బొట్టు పెట్టి చీర (సారే) అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అనేక కార్యక్రమాలు చేపట్టింది. మహిళా సంఘాలకు ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా వడ్డీలేని రుణాలు ఇవ్వడం జరిగింది. మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు, బస్సులు, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం మహిళలకు అనేక పథకాలు అమలు చేస్తుంది. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి మహిళా సంఘాల వాళ్ళు చీరలు సారే పంపిణీ చేపడుతున్నారు. రేషన్ కార్డు ఉన్న అందరికీ ఈ చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో ఆర్థిక వృద్ధి సాధించి మహిళలు ఉన్నత శిఖరాలకు ఎదగాలని రాష్ట్రంలో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ప్రభుత్వానికి ఆశీర్వాదం ఇవ్వండి మరిన్ని మంచి కార్యక్రమాలతో ముందుకు పోతాం. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నాం. పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. ప్రతి గ్రామాల్లో వాటర్ ప్లాంట్ ఎరోటి చేస్తాం. గౌరవెల్లి ప్రాజెక్ట్ ఒక్కో మెట్టు పూర్తి చేసుకొని ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుంటున్నాం అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు