
వరంగల్, 23 నవంబర్ (హి.స.) ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీని తీసుకువచ్చిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, యువజన, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. వరంగల్ కాళోజి కళాక్షేత్రం వద్ద మారథాన్ ను ఆదివారం రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కెఆర్ నాగరాజు, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ లతో కలిసి పాల్గొన్నారు. క్రీడల పట్ల ప్రతి ఒక్కరూ ఆసక్తిని పెంపొందించు కోవాలన్నారు. జీవితంలో సంతోషంగా ఉండాలని.. సంతోషంగా ఉంచాలని పేర్కొన్నారు. క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను రాణించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీని తీసుకువచ్చిందన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు