పుట్టపర్తి సత్యసాయి బాబానే నాకు పేరు పేరు పెట్టారు.. సినీనటి సాయి పల్లవి
హైదరాబాద్, 23 నవంబర్ (హి.స.) పుట్టపర్తిలోని ఈ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా ప్రత్యేక పుష్పాలతో సత్యసాయి మహా సమాధిని అలంకరిస్తున్నారు. హిల్ వ్యూ స్టేడియంలో స్వర్ణ రథంపై సత్యాస
సాయి పల్లవి


హైదరాబాద్, 23 నవంబర్ (హి.స.)

పుట్టపర్తిలోని ఈ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా ప్రత్యేక పుష్పాలతో సత్యసాయి మహా సమాధిని అలంకరిస్తున్నారు. హిల్ వ్యూ స్టేడియంలో స్వర్ణ రథంపై సత్యాసాయి చిత్ర పటాన్ని ఊరేగింపును సత్యసాయి ట్రస్ట్ నిర్వహించనుంది. ఈ క్రమంలో... తాజాగా, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి(Sai Pallavi) ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేసింది. మా అమ్మ తాతయ్య సాయి బాబాకు భక్తులు. అంతేకాకుండా మా అమ్మ, అత్తమ్మ, మావయ్య అందరూ సాయి బాబాకు చెందిన యూనివర్సిటీలో చదివారు. అందుకే నన్ను చిన్నప్పటి నుంచి అక్కడికి తీసుకెళ్లేవారు. పుట్టపర్తి సాయిబాబా స్వామి పేరు కలిసేలా ఉండాలని నాకు బాబానే స్వయంగా పేరు పెట్టారు.

14, 15 ఏళ్ల తర్వాత నా పేరు నాకు నచ్చింది. చాలా డిఫరెంట్గా ఉందనిపించింది. అప్పటి నుంచి నేను కూడా సాయిబాబాకు భక్తురాలిగా మారిపోయాను. సత్యసాయి భోధనలే నాలో ధైర్యాన్ని నింపాయి. అలాగే ఎలాంటి సమయంలోనూ ప్రశాంతంగా, ఒత్తిడిని అధిగమించడం, క్రమశిక్షణ, ధ్యానం వంటివి ఆయన ద్వారానే నేర్చుకున్నాను” అని చెప్పుకొచ్చింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande