రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ సారథి పై సస్పెన్స్..
హైదరాబాద్, 23 నవంబర్ (హి.స.) రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడి ఎంపిక విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు డీసీసీలను అధిష్టానం ప్రకటించినప్పటికీ రంగారెడ్డి జిల్లా డీసీసీ నియామకాన్ని ప్రకటించక పెండింగులో పెట్టింది. డీసీసీ
రంగారెడ్డి జిల్లా


హైదరాబాద్, 23 నవంబర్ (హి.స.)

రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడి ఎంపిక విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు డీసీసీలను అధిష్టానం ప్రకటించినప్పటికీ రంగారెడ్డి జిల్లా డీసీసీ నియామకాన్ని ప్రకటించక పెండింగులో పెట్టింది. డీసీసీ ఎంపిక కోసం పార్టీ అధిష్టానం అభిప్రాయ సేకరణ పేరుతో హడావుడి చేసింది. జిల్లాకు చెందిన చాలామంది అధ్యక్ష పీఠం కోసం దరఖాస్తు చేసుకోగా.. ప్రధానంగా బడంగ్ పేట మున్సిపల్ కార్పోరేషన్ మాజీ మేయర్ చిగురింత పారిజాత నర్సింహ్మారెడ్డి, పార్టీ సీనియర్ నేత రాజిరెడ్డిల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు నేతల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో డీసీసీ ప్రెసిడెంట్ ను ప్రకటించకుండా చివరి నిమిషంలో పార్టీ అధినాయకత్వం వాయిదా వేసినట్లు తెలుస్తోంది. జిల్లాకు మంత్రి లేకపోవడం.. డీసీసీ అధ్యక్షుని నియామకంపైననూ సస్పెన్స్ కొనసాగుతుండడంతో.. నాన్చివేత ధోరణి పై పార్టీ శ్రేణుల్లోనూ ఒకింత అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రస్తుత పరిస్థితులు స్థానిక సంస్థల వేళ గందరగోళానికి దారి తీస్తాయన్న అభిప్రాయాన్ని పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande