కలెక్టర్ పమేల సత్పతి తో కలిసి చీరల పంపిణీ చేసిన మంత్రి పొన్నం
కరీంనగర్, 23 నవంబర్ (హి.స.) మహిళలకు ఆర్థిక చేయూతనిస్తూ వారిని ఉన్నత స్థానంలో నిలుపుతామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సైదాపూర్ మండల కేంద్రంలోని విశాల పరపతి సహకార సంఘం పంక్షన్ హాల్లో ఇందిరా మహిళా శక్తి చీరల పంప
మంత్రి పొన్నం


కరీంనగర్, 23 నవంబర్ (హి.స.)

మహిళలకు ఆర్థిక చేయూతనిస్తూ

వారిని ఉన్నత స్థానంలో నిలుపుతామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సైదాపూర్ మండల కేంద్రంలోని విశాల పరపతి సహకార సంఘం పంక్షన్ హాల్లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొన్నం పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళా సంఘాలు నిర్ణయించిన మోడల్ చీరలను పంపిణీకి ఎంపిక చేశామని తెలిపారు. గ్రామ, మండల సమాఖ్య బాధ్యులు చీరల పంపిణీ బాధ్యతను తీసుకొని ప్రతి మహిళలకు చీరలు అందేలా చూడాలని అన్నారు. మహిళలు ఐక్యంగా ఉండాలనే సందేశంతో చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande