
హైదరాబాద్, 23 నవంబర్ (హి.స.) వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని ఊటుపల్లి గ్రామంలో ఆదివారం రోజు మహిళా సంఘం సభ్యులు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారు. ఈ తరుణంలో గ్రామానికి సరిపడా చీరలు రాకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం తో చీరల పంపిణీ కార్యక్రమం అడ్డుకున్నారు. మొత్తం వచ్చేవరకు ఇచ్చే ప్రసక్తే లేదని గ్రామస్తులు మహిళా సంఘం సభ్యులకు తెలియజేశారు. సంఘం సభ్యులు సర్ది చెప్పినా కూడా వినకపోవడంతో పంపిణీ నిలిచిపోయింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు