
తమిళనాడు, 23 నవంబర్ (హి.స.)
టీవీకే పార్టీ అధినేత,
ప్రముఖ నటుడు దళపతి విజయ్ తన పార్టీ శ్రేణులతో సమావేశం అయ్యారు. ఆదివారం తమిళనాడులోని కాంచిపురం జిల్లా మూడు తాలూకాల నుంచి ఎంపిక చేసిన పార్టీ శ్రేణులతో మాట్లాడారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై విజయ్ చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు అందరికీ సొంత ఇళ్లు ఉండాలనేదే టీవీకే లక్ష్యమని ప్రకటించారు. అంతేకాదు.. రాష్ట్రంలోని ప్రతీ ఇంట్లో ఒక బైక్ ఉండాలని పేర్కొన్నారు. అధికారంలోకి రాబోయేది మనమే అని జోస్యం చెప్పారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచే శాంతిభద్రతల పట్ల కఠినంగా ఉంటామని అన్నారు. ప్రభుత్వరంగ సంస్థల నుంచి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. వరదలను ఎలా ఎదుర్కోవాలో ప్రణాళికలు సైతం సిద్ధం చేశామని వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..