
హైదరాబాద్, 23 నవంబర్ (హి.స.)
తెలంగాణలో మరోసారి సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఏకంగా సీఎంవో (Telangana CMO) వాట్సాప్ గ్రూప్ తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులకు చెందిన వాట్సాప్ మీడియా గ్రూప్లను హ్యాక్ (WhatsApp Hack) చేశారు. ఎస్బీఐ బ్యాంక్ ఆధార్ అప్డేషన్ పేరుతో ప్రమాదకర ఏపీకే ఫైల్స్ ను షేర్ చేసిన కేటుగాళ్లు.. ఆధార్ అప్డేషన్ చేసుకోవాలంటూ SBI పేరుతో సందేశాలు పంపిస్తున్నారు. మరో వైపు ఏపీకే ఫైల్స్ ను ఓపెన్ చేయవద్దని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే రాష్ట్ర పరిపాలనలో అత్యంత కీలకమైన వారికి సంబంధించిన వాట్సాప్ మీడియా గ్రూప్ లను సైబర్ నేరగాళ్లు లక్ష్యం చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. కాగా 8 రోజుల క్రితమే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వెబ్ సైట్ హ్యాక్ కు గురైన సంగతి తెలిసిందే. కోర్టు ఆర్డర్ కాపీలు డౌన్ లోడ్ చేస్తుండగా గేమింగ్ సైట్ లోకి డైరెక్షన్ చేశారు. దీంతో తెలంగాణ డీజీపీకి హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..