
హైదరాబాద్, 23 నవంబర్ (హి.స.)
కాప్రా డివిజన్ ఎల్లారెడ్డి గూడలో చేపడుతున్న భూగర్భ మురుగునీటి కాలువ పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. ఆదివారం స్థానిక నివాసితులతో కలిసి ఎమ్మెల్యే అభివృద్ధి పనులకు పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఎల్లారెడ్డిగూడ తాళ్ల వద్ద మురుగునీటి కాలువలు లేక ఇబ్బంది పడుతున్నట్లు స్థానికులు తన దృష్టికి తీసుకురావడంతో వెంటనే నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులను చేయిస్తున్నట్లు తెలిపారు. ఈ అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో పూర్తిచేసి ప్రజల వినియోగంలోకి తేవాలని ఆయన అధికారులను సూచించారు. ప్రజాసేవ చేసేందుకు తను ఎల్లప్పుడూ ముందుంటానని, ఏ సమస్య ఉన్న తన దృష్టికి వస్తే.. వాటి పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని కాలనీవాసులకు హామీ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..