
వనపర్తి, 23 నవంబర్ (హి.స.)
రాష్ట్రంలోని పేద ప్రజల ఎన్నో ఏళ్ల సొంత ఇంటి కల నేడు ఇందిరమ్మ రాజ్యంలో సహకారమైందని వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఏదుల మండలం పరిధిలోని చీర్కపల్లి గ్రామానికి చెందిన పబ్బాతి సరస్వతి, వీరమోని ఉషమ్మల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి హాజరై లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే గృహ నిర్మాణ బిల్లులు లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అందుతున్నాయని ఆ విధంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు