
వికారాబాద్, 23 నవంబర్ (హి.స.) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి
ఎనుముల రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా రేపు (సోమవారం) మధ్యాహ్నం 2:30 గంటలకు కొడంగల్ కు రానున్నారు. ముందుగా ఎన్కెపల్లి రోడ్లో ఉన్న వేదిక వద్ద అక్షయ పాత్ర ఫౌండేషన్ వారి మధ్యాహ్న భోజన కిచెన్ షెడ్ భూమిపూజ, వివిధ అభివృద్ధి కార్యాక్రాకమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, సంక్షేమ పథకాలు ప్రారంభిస్తారు. తదనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేయగా, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పర్యవేక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు