అనంతపురం లో వైకాపా .మాజీ ఎమ్యేల్యే కేతి. రెడ్డి పెద్దా రెడ్డి..అనుచరుడు హల్చల్
అనంతపురం, 23 నవంబర్ (హి.స.) : వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరుడు మూడేళ్లుగా బెదిరింపులకు పాల్పడుతూ దాడి చేశారని బాధితురాలు అనంతపురం పోలీసులను ఆశ్రయించారు. వైకాపా నేత సత్యనారాయణరెడ్డి, శ్రీనివాసులు, రాఘవేంద్రరెడ్డి, బాధితురాలు శ
అనంతపురం లో వైకాపా .మాజీ ఎమ్యేల్యే కేతి. రెడ్డి పెద్దా రెడ్డి..అనుచరుడు హల్చల్


అనంతపురం, 23 నవంబర్ (హి.స.)

: వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరుడు మూడేళ్లుగా బెదిరింపులకు పాల్పడుతూ దాడి చేశారని బాధితురాలు అనంతపురం పోలీసులను ఆశ్రయించారు. వైకాపా నేత సత్యనారాయణరెడ్డి, శ్రీనివాసులు, రాఘవేంద్రరెడ్డి, బాధితురాలు శ్రీలత నాలుగేళ్ల క్రితం ఆసుపత్రి భవనాన్ని లీజుకు తీసుకున్నారు. ఆసుపత్రి పూర్తయిన తర్వాత మొత్తం తనకే అప్పగించాలని సత్యనారాయణరెడ్డి బెదిరింపులకు దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. 3 రోజుల్లో ఆసుపత్రి ప్రారంభించాల్సి ఉండగా.. సత్యనారాయణరెడ్డి తన అనుచరులతో కలిసి ఆసుపత్రిలోని ఫర్నిచర్‌ ధ్వంసం చేశారని ఆరోపించారు. ఫర్నిచర్‌ మొత్తం ధ్వంసం చేశారని, ఆర్థికంగా తీవ్ర నష్టం జరిగిందని బాధితురాలు శ్రీలత వాపోయారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని వేడుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande