
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}హైదరాబాద్,, 24 నవంబర్ (హి.స.)
: మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్‌పై దారుణ సంఘటన జరిగింది. ప్రయాణిస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి, డ్రైవర్ సజీవదహనమైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. శామీర్‌పేట్ నుంచి కీసరకు వెళ్తుండగా లియోనియో రెస్టారెంట్ సమీపంలోని ఓఆర్‌ఆర్ పై కారులో మంటలు చెలరేగాయి. కారును రోడ్డు పక్కన ఆపి, ఏసీ ఆన్ చేసి నిద్రిస్తున్న సమయంలో మంటలు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అయితే, క్షణాల్లోనే మంటలు మొత్తం వాహనాన్ని చుట్టుముట్టాయి. దీంతో నిద్రలోనే డ్రైవర్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని వివరాలు సేకరిస్తున్నారు. మంటలు ఎలా వచ్చాయి? షార్ట్ సర్క్యూట్ కారణమా? లేదా మరేదైనా అనుమానాస్పద కారణమా? అనే దానిపై విచారణ కొనసాగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ