
బాపట్ల, 24 నవంబర్ (హి.స.)నరసాయపాలెం జిల్లాలో చైతన్యవంతమైన గ్రామం. విద్యావంతుల కేంద్రంగా గుర్తింపు తెచ్చుకుంది. వందల మంది వైద్యులు, ఇంజినీర్లు, శాస్తవేత్తలుగా దేశ, విదేశాల్లో స్థిరపడ్డారు. ఈ గ్రామం నుంచి ఐదుగురు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్‌లుగా సేవలందించారు. ఊట్ల అప్పారావు ఐపీఎస్‌కు ఎంపికై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌గా పని చేశారు. అజయ్ కళ్లం ఐఏఎస్ అధికారిగా సేవలందించారు.
ఏపీ సీఎస్‌గానూ పని చేశారు. ప్రత్తిపాటి గౌతమ్ కుమార్ ఐపీఎస్‌కు ఎంపికై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హోంశాఖ ముఖ్య కార్యదర్శి హోదాలో పదవీ విరమణ చేశారు. ఆయన తండ్రి ప్రత్తిపాటి అంకమ్మ చౌదరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా సేవలందించారు. కన్నెగంటి సంధ్యారాణి సివిల్ సర్వీసెస్‌కు ఎంపికై పాఠశాల విద్యాశాఖ కమిషనర్, కేంద్ర తపాలా శాఖ సంచాలకురాలిగా సేవలందించారు. ఇటీవలే ఉద్యోగ విరమణ చేశారు. కుంభా శివకృష్ణ 2011లో ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం విశాఖ జీఎస్టీ సంయుక్త సంచాలకుడిగా ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ