ఆంధ్రుల భద్రాద్రి గా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శివారు గ్రామాల్లో బెట్టింగ్
,ఒంటిమిట్ట 24 నవంబర్ (హి.స.)ఆంధ్రుల భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట, శివారు గ్రామాల్లో కొందరు బెట్టింగ్‌ బంగార్రాజులు పాగా వేశారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకున్న కొందరు నిరుద్యోగ యువకులు ఆన్‌లైన్‌ బెట్టింగ్, గేమింగ్‌ల బాట పట్టారు. లాభాలం
ఆంధ్రుల భద్రాద్రి గా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శివారు గ్రామాల్లో బెట్టింగ్


,ఒంటిమిట్ట 24 నవంబర్ (హి.స.)ఆంధ్రుల భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట, శివారు గ్రామాల్లో కొందరు బెట్టింగ్‌ బంగార్రాజులు పాగా వేశారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకున్న కొందరు నిరుద్యోగ యువకులు ఆన్‌లైన్‌ బెట్టింగ్, గేమింగ్‌ల బాట పట్టారు. లాభాలంటూ బంధువులు, మిత్రులు, ఇరుగుపొరుగు వారిపై ఆశల వల విసురుతున్నారు. కావాలంటే తాము పెట్టుబడి సర్దుబాటు చేస్తామని.. బ్యాంకుల్లో అదనపు ఖాతాలు తెరవాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. ఈ తీరుతో పలువురు ఇప్పుడు కలత చెందుతున్నారు.

ఆశల వల విసురుతున్నారు: సాలాబాదు పంచాయతీలోని ఓ పల్లెకు చెందిన యువకులు మండల కేంద్రమైన ఒంటిమిట్టకు మకాం మార్చారు. పందేలు, కమీషన్‌ రూపంలో రూ.లక్షలు ఆర్జించారు. ఒకనాడు అతి సాధారణ జీవితం గడిపిన వీరంతా.. ఇప్పుడు విలాసాలకు అలవాటు పడ్డారు. అడ్డదారిలో పొందిన డబ్బుతో ఖరీదైన వాహనాలు కొనుగోలు చేశారు. బెట్టింగ్‌లతో జీవితాలు బాగుపడతాయనేందుకు తామే నిదర్శనమంటూ కొందరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, బంధుమిత్రులను కూడా ఉచ్చులోకి దించుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande