
విశాఖపట్నం, 24 నవంబర్ (హి.స.)మలక్కా జలసంధి, దక్షిణ అండమాన్ సముద్రంలో ఉన్న అల్పపీడనం సోమవారం తీవ్ర అల్పపీడనంగా బలపడి అక్కడే కొనసాగుతోంది. సముద్రమట్టం నుంచి 7.6 కిమీ ఎత్తు వరకు ఉపరితల చక్రవత ఆవర్తనం ఏర్పడింది. ఇక ఈ తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి మరింత బలపడి ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
తదుపరి 24 గంటలలో ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి మరింత బలపడి నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో తుఫానుగా మారుతుందని తెలిపింది. ఈ వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో చలి తీవ్రత తగ్గింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఇలా నమోదయ్యాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV