
విజయవాడ, 24 నవంబర్ (హి.స.)
వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిఅస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన ఆయనను వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గతకొంతకాలంగా వెరికోస్ వెయిన్స్‌తో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చెవిరెడ్డి అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఆస్పత్రిలో ఆయనకు వైద్యం అందిస్తున్నారు. అనంతరం డాక్టర్లు మీడియాకు చెవిరెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ