
అమరావతి, 24 నవంబర్ (హి.స.) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతన్నలకు అలర్ట్. ఇవాల్టి నుంచి ఏపీ వ్యాప్తంగా రైతన్నా.. మీ కోసం అనే కార్యక్రమాన్ని నిర్వహించనుంది కూటమి ప్రభుత్వం. మొత్తం ఏడు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు అధికారులు. నేటి నుంచి ఈ నెల 29వ తేదీ వరకు ప్రతి రైతు ఇంటికి వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు వెళ్ళనున్నారు. సీఎంచంద్రబాబుకూడా కొంత మంది రైతులతో నేరుగా మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతుల సమాచారాన్ని సేకరించడం, పంటల గురించి రైతులకు పలు సూచనలు చేయనున్నారు వ్యవసాయ అధికారులు. పంట ఎంపిక, లాభదాయకమైన పంటలు వేయడం లాంటి అంశాలపై కూడా రైతులకు సమాచారం అందిస్తారు అధికారులు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV