ఏపీలో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటు
అమరావతి, 25 నవంబర్ (హి.స.) అమరావతి: ఏపీలో కొత్తగా మూడు జిల్లాలను ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. నూతనంగా మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై వరుసగ
ఏపీలో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటు


అమరావతి, 25 నవంబర్ (హి.స.)

అమరావతి: ఏపీలో కొత్తగా మూడు జిల్లాలను ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. నూతనంగా మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై వరుసగా రెండో రోజు సమీక్షించిన సీఎం.. కొన్ని మార్పుచేర్పులకు ఆమోదం తెలిపారు.

మరోవైపు కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సీఎం అంగీకారం తెలిపారు. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి రెవెన్యూ డివిజన్, ప్రకాశం జిల్లాలో అద్దంకి, కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లె జిల్లాలో పీలేరు రెవెన్యూ డివిజన్, నంద్యాల జిల్లాలో బనగానపల్లె రెవెన్యూ డివిజన్‌, సత్యసాయి జిల్లాలో మడకశిర రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా కర్నూలు జిల్లాలోని ఆదోని మండలాన్ని విభజించి పెద్దహరివనాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేసేందుకు సీఎం అంగీకరించారు. మూడు కొత్త జిల్లాల ఏర్పాటులో ఏపీలో జిల్లాల సంఖ్య 29కి చేరనుంది.

మరోవైపు.. ఏపీ లాజిస్టిక్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఏపీ లింక్‌ ద్వారా లాజిస్టిక్స్‌లో భారీ పెట్టుబడులు వచ్చేలా చేయాలని మంత్రులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande