మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.మోహన్ రెడ్డి రెండవ రోజు.పులివెందుల పర్యటన
కడప, 26 నవంబర్ (హి.స.) వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కడప జిల్లా పులివెందుల పర్యటన రెండవ రోజు బిజీబిజీగా సాగింది.. ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యకర్తలను కలవటం… పరామర్శించటం.. భరోసా ఇవ్వటం.. అండగా ఉంటా
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.మోహన్ రెడ్డి రెండవ రోజు.పులివెందుల పర్యటన


కడప, 26 నవంబర్ (హి.స.)

వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కడప జిల్లా పులివెందుల పర్యటన రెండవ రోజు బిజీబిజీగా సాగింది.. ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యకర్తలను కలవటం… పరామర్శించటం.. భరోసా ఇవ్వటం.. అండగా ఉంటామని చెబుతూ పూర్తి చేశారు.. రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా పలువురు పార్టీ నేతలకు సంబంధించిన వివాహ వేడుకలకు హాజరైన జగన్ వధూవరులను ఆశీర్వదించారు.. మార్గం మధ్యలో ప్రజలను కలుస్తూ సమస్యలను తెలుసుకుని అధైర్యపడొద్దని వారికి భరోసా ఇచ్చారు జగన్.. అనంతరం అరటి రైతుల వద్దకు వెళ్లిన జగన్ సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.. రెండవ రోజు కూడా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు భాకరాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్‌ నిర్వహించారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులను ఆయన కలిశారు.. పులివెందుల చుట్టుపక్కల వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి యోగక్షేమాలు తెలుసుకుని భరోసా కల్పించారు..

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande