
నెల్లూరు, 26 నవంబర్ (హి.స.) జిల్లా జలదంకి మండలం గట్టుపల్లి చింతలపాలెంలో తెదేపా నేత దారుణ హత్యకు గురయ్యారు. తెదేపా నేత గొట్టిపాటి ప్రసాద్‌ను దుండగులు కత్తితో గొంతు కోసి చంపారు. గ్రామ శివారులోని తన కోళ్ల ఫారంలో ప్రసాద్ పనిచేసుకుంటుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. (Crime News)
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ