తిరుమల పరకామణి చోరీ కేసులో సిఐడి విచారణకు తోటి మాజీ ఈవో ధర్మారెడ్డి
అమరావతి, 26 నవంబర్ (హి.స.) తిరుమల పరకామణి చోరీ కేసులో ( సీఐడీ విచారణకు టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి ) హాజరయ్యారు. ఈ కేసులో విచారణకు రావాల్సిందిగా సీఐడీ పిలుపు మేరకు.. ఈరోజు (బుధవారం) విజయవాడ తులసినగర్‌లోని సీఐడీ కార్యాలయంలో ధర్మారెడ్డి విచారణకు వ
తిరుమల పరకామణి చోరీ కేసులో సిఐడి విచారణకు తోటి మాజీ ఈవో ధర్మారెడ్డి


అమరావతి, 26 నవంబర్ (హి.స.)

తిరుమల పరకామణి చోరీ కేసులో ( సీఐడీ విచారణకు టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి ) హాజరయ్యారు. ఈ కేసులో విచారణకు రావాల్సిందిగా సీఐడీ పిలుపు మేరకు.. ఈరోజు (బుధవారం) విజయవాడ తులసినగర్‌లోని సీఐడీ కార్యాలయంలో ధర్మారెడ్డి విచారణకు వచ్చారు. టీటీడీ మాజీ ఈవోను సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ విచారిస్తున్నారు. పరకామణి కేసులో ఇప్పటికే రెండు సార్లు ధర్మారెడ్డిని సీఐడీ విచారించిన విషయం తెలిసిందే. ఇక నిన్న ఇదే కేసులో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని సీఐడీ ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించి పలువురు అధికారులను విచారించిన అనంతరం ధర్మారెడ్డిని మరోసారి సీఐడీ విచారణకు పిలిచింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande