
హైదరాబాద్, 25 నవంబర్ (హి.స.) ఆఫ్ఘనిస్థాన్ - పాకిస్థాన్ సరిహద్దుల్లో
మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. ఆఫ్ఘన్ వాణిజ్యమంత్రి అల్హాజ్ నూరుద్దీన్ అజజ్ ప్రస్తుతం భారత పర్యటనలో ఉండగా.. ఆఫ్ఘన్ పై పాకిస్థాన్ డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. గత అర్థరాత్రి ఆఫ్ఘన్ లోని ఖోస్ట్ ప్రావిన్స్ పై పాక్ దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో సరిహద్దుల్లో ఉన్న ఇళ్లు ధ్వంసమవ్వగా 9 మంది చిన్నారులు సహా 10 మంది మరణించారు. ఈ మేరకు తాలిబన్ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. తమ దేశంలోని ఇతర ప్రావిన్సులపై కూడా ఈ దాడుల ప్రభావం ఉందని తెలిపింది. పాకిస్థాన్ లోని పెషావర్ లో సోమవారం జరిగిన ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్థాన్ .. తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (TTP) టెర్రరిస్టులకు ఆశ్రయం కల్పిస్తోందని పాక్ సర్కార్ ఆరోపిస్తోంది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు