సింగర్ జుబిన్ గార్గ్ ను హత్య చేశారు.. అసెంబ్లీ వేదికగా సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకటన
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}ఢిల్లీ 25నవంబర్ (హి.స.) అస్
సింగర్ జుబిన్ గార్గ్


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}ఢిల్లీ 25నవంబర్ (హి.స.)

అస్సాం ప్రముఖ సింగర్ జుబిన్ గార్గ్

(Singer Zubin Garg) సింగపూర్ లో ప్రాణాలు కోల్పోవడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఆయన మరణంపై మొదటి నుంచి అనేక అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో స్థానిక ప్రభుత్వం ప్రత్యేక విచారణకు ఆదేశించింది. కాగా ఈ రోజు సింగర్ జుబిన్ గార్గ్ మరణంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Chief Minister Himanta Biswa Sarma) అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. 52 ఏళ్ల జుబిన్ గార్గ్ ప్రమాదవశాత్తు మరణించలేదని, ఆయన హత్యకు గురయ్యారని సీఎం హిమంత స్పష్టం చేశారు. ఇటీవల జుబిన్ సింగపూర్లో ప్రమాదవశాత్తు మరణించినట్లు వార్తలు వెలువడగా, ఆయన కుటుంబ సభ్యులు మొదటి నుంచి ఈ మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. పోలీసుల విచారణలో భాగంగానే ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి చేసిన ఈ ప్రకటనతో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా అస్సాంలో ఈ కేసుపై తీవ్ర సంచలనం నెలకొంది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande