
ములుగు, 25 నవంబర్ (హి.స.)
తెలంగాణ- ఛత్తీస్ ఘడ్ సరిహద్దులో భారీగా CRPF భద్రతా బలగాలు మోహరించారు. కర్రెగుట్టలను భద్రతాబలగాలు పూర్తిగా హస్తగతం చేసుకున్నాయి. తెలంగాణ సరిహద్దులోని ములుగు జిల్లా వాజేడు మండలం మొరుమూరు వద్ద CRPF బేస్ క్యాంపు ఏర్పాటు చేశారు. నూతనంగా ఏర్పాటుచేసిన సీఆర్పీఎఫ్ 39 బెటాలియన్ను సీఆర్పిఎఫ్ ఐజీ త్రివిక్రమ్ ఐపీఎస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. “కర్రెగుట్టలపై అతితక్కువ కాలంలో పట్టు సాధించాం.. ఈ ప్రాంతాన్ని సేఫ్ ప్లేస్ గా తీర్చి దిద్దుతాం.. త్వరలో కర్రెగుట్టలపైకి రోడ్ వే ఏర్పాటు చేస్తాం.. పైన కూడా Crpf క్యాంపు ఏర్పాటు చేస్తాం.. ప్రజలు స్వేచ్ఛగా తిరిగే విధంగా తయారు చేస్తాం.. ఇక్కడి ప్రజల అభివృద్ధికి అవసరమైన అన్ని వసతులు కల్పిస్తాం.” అని వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు