చెక్ డ్యాములపై మీ విజిలెన్స్ విచారణ ఏమైంది?.. సీఎంకు బండి
హైదరాబాద్, 25 నవంబర్ (హి.స.) నీళ్లు-నిధులు-నియామకాలు అనే నినాదంతోనే స్వరాష్ట్రం ఏర్పడి 11 ఏళ్లు దాటినా నేటికీ వీటి విషయంలో ప్రజలకు తీరని అన్యాయం జరుగుతూనే ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్రంలో చెక్ డ్యామ్ ల నిర్మాణంలో జరిగిన అవక
బండి సంజయ్


హైదరాబాద్, 25 నవంబర్ (హి.స.)

నీళ్లు-నిధులు-నియామకాలు అనే నినాదంతోనే స్వరాష్ట్రం ఏర్పడి 11 ఏళ్లు దాటినా నేటికీ వీటి విషయంలో ప్రజలకు తీరని అన్యాయం జరుగుతూనే ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్రంలో చెక్ డ్యామ్ ల నిర్మాణంలో జరిగిన అవకతవకలు, నాసిరకం పనులపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని తనుగుల-గుంపుల వద్ద నిర్మించిన చెక్ డ్యామ్ ధ్వంసమైన నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి రేవత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ రాశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని చెక్ డ్యాంల కూలివేతకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande