
సిద్దిపేట, 25 నవంబర్ (హి.స.)
ఆశ పెట్టడం.. ఆయాస పెట్టడం... మభ్య పెట్టడం.. మోసం చేయడం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సిద్దిపేట నియోజక వర్గ స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ... మాజీ సీఎం కేసీఆర్ పండుగ పండగకి సంక్షేమ పథకాలు ఇస్తే నేటి సీఎం రేవంత్ రెడ్డి ఓట్ల ఓట్లకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారని ఎద్దెవా చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రతి బతుకమ్మకి 18ఏండ్లు నిండిన మహిళలందరికీ కోటి 30 వేల మహిళలకు చీరలు అందించినట్లు గుర్తు చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు