
జనగామ, 25 నవంబర్ (హి.స.)
తెలంగాణ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు పంపిణీ చేస్తున్న వడ్డీలేని రుణాల పరిమితిని పెంచాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కోరారు. మంగళవారం చేర్యాల మండలం ముస్త్యాల గ్రామ రైతు వేదికలో నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలకు గాను 1.55 కోట్ల వడ్డీలేని రుణాలను పంపిణీ కార్యక్రమంలో సిద్ధిపేట జిల్లా కలెక్టర్ హైమావతి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు