
హైదరాబాద్, 25 నవంబర్ (హి.స.)
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలను దోచుకునేది అంతా ఆంధ్రా సినిమా నిర్మాతలే అని అన్నారు. ప్రజలు తన వద్దకు వచ్చి చెప్పిన మాటనే తాను చెబుతున్నానని వ్యాఖ్యానించారు. సినిమా అనేది వ్యాపారం అని, వెయ్యి కోట్లు పెట్టి సినిమాలు చేసి మూడు వేల కోట్లు సంపాదించాలని అనుకుంటారని అన్నారు. సినిమాలు ఫ్లాప్ అయ్యి రోడ్లపైకి వచ్చిన నిర్మాతలు కూడా ఉన్నారని అన్నారు. సినిమా నిర్మాతల్లో 99శాతం మంది ఆంధ్రా నుండే ఉన్నారని చెప్పారు. వాళ్లే తెలంగాణలో ఉండి ఇలాంటి పనులు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ వాళ్లు అలాంటి పనులు చేయరని చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు