ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చే వారిని నిలదీయాలి.. మహేష్ కుమార్ గౌడ్
కామారెడ్డి, 25 నవంబర్ (హి.స.) ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చే ప్రతిపక్ష నాయకులను నిలదీయాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం నాడు ఆయన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో మహిళలకు వడ్డీ లేని రుణాలను పంపిణీ
మహేష్ కుమార్


కామారెడ్డి, 25 నవంబర్ (హి.స.)

ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చే

ప్రతిపక్ష నాయకులను నిలదీయాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం నాడు ఆయన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో మహిళలకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసే కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1100 కోట్ల రూపాయలను వడ్డీలేని రుణాల కింద రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసిందన్నారు. దీంట్లో నుంచి మూడు కోట్ల రూపాయలకు పైగా కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చాయన్నారు. అయితే గత బీ ఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఈ విధంగా ఎప్పుడైనా వడ్డీ లేని రుణాలు ఇచ్చారా అంటూ మహిళలను ప్రశ్నించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande