
హైదరాబాద్, 25 నవంబర్ (హి.స.)
ఈనెల 18వ తేదీన ఏపీలోని
మారేడుమిల్లి అటవీప్రాంతంలో మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన హిడ్మా ఎన్ కౌంటర్ లో మరణించిన విషయం తెలిసిందే. అతని ఎన్ కౌంటర్ పై అనుమానం వ్యక్తం చేస్తూ.. న్యాయవాది కె. విజయ్ కిరణ్ NHRCని ఆశ్రయించారు. హిడ్మా ఎన్ కౌంటర్ ఫేక్ అయ్యే అవకాశాలు ఉండటంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆయన NHRCని కోరారు. హిడ్మా ఎన్ కౌంటర్ పై నమోదైన ఎఫ్ఎఆర్ నంబర్లు 52/2025, 53/2025లలో అనుమానాస్పద అంశాలున్నట్లు విజయ్ ఆరోపించారు.
NHRC గైడ్ లైన్స్ ప్రకారం.. ఎన్ కౌంటర్లో ఉన్న పోలీసులపై ఎఫ్ఎఆర్ నమోదు కాలేదన్నారు. ఈ ఎన్ కౌంటర్ పై నిజనిజాలేంటో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..