
మెదక్, 25 నవంబర్ (హి.స.) రాష్ట్రంలో మహిళా సంఘాలకు రూ.304 కోట్ల వడ్డీలేని రుణాలు ప్రభుత్వం అందజేస్తుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. మంగళవారం చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో జరిగిన మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లాకు సంబంధించి రూ.30 కోట్లు నియోజకవర్గానికి సంబంధించి రూ. 2 కోట్ల 88 లక్షలు చెక్కులను అందజేశారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు