
హైదరాబాద్, 25 నవంబర్ (హి.స.)
ఢిల్లీలో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి
నేపథ్యంలో గత కొద్ది రోజులుగా దేశంలో మదర్సాలపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన మదర్సాల్లో ముస్లీంలకు దేశంపై విషం నింపుతున్నారని, ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ.. మదర్సాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదుల దాడిలో హిందువులే కాకుండా ముస్లింలు కూడా చనిపోయారని, భారత దేశానికి శత్రువులు అయిన వారు ముస్లీంలకు కూడా శత్రువులు అవుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మదర్సాలలో కనీసం గదులు కూడా నిర్మించలేని వారు.. బాంబులు తయారు చేయడం నేర్పిస్తున్నారని, ఇది క్షమించరాని నేరమని, దేశద్రోహులు 14 మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్నారని, ఉన్నత చదువులు చదివి బాంబులు తయారు చేసి మతానికి చెడ్డపేరు తెస్తున్నారంటూ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు