రాష్ట్ర ప్రభుత్వ సమాచారం బీఆర్ఎస్కు లీక్!. మంత్రి శ్రీధర్ బాబు వార్నింగ్
హైదరాబాద్, 25 నవంబర్ (హి.స.) తెలంగాణలో ప్రభుత్వ నిర్ణయాలు, కేబినెట్లో జరిగిన చర్చల సారాంశం మొత్త ప్రతిపక్ష నేతలకు చేరవేస్తున్న లీకు వీరుల విషయంలో మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. ఇవాళ సెక్రటేరియట్లో జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మ
మంత్రి శ్రీధర్ బాబు


హైదరాబాద్, 25 నవంబర్ (హి.స.)

తెలంగాణలో ప్రభుత్వ నిర్ణయాలు, కేబినెట్లో జరిగిన చర్చల సారాంశం మొత్త ప్రతిపక్ష నేతలకు చేరవేస్తున్న లీకు వీరుల విషయంలో మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. ఇవాళ సెక్రటేరియట్లో జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు శ్రీధర్ బాబు స్పందిస్తూ ఈ లీకుల విషయం మీడియా ద్వారా తమ దృష్టికి వచ్చిందని కేబినెట్ నిర్ణయాలు, ప్రభుత్వ నిర్ణయాల లీక్ పై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో కేబినెట్ సైతం ఇదే ఆలోచనతో ఉందన్నారు. కేబినెట్ నిర్ణయాలు చాలా కాన్ఫిడెన్షియల్ అని అలాంటిది ఇంకా జీవోలు రాకముందే వాటి సారాంశం ఇతరులకు చేరవేడం అంటే అలాంటి ఘటనలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande