
హైదరాబాద్, 25 నవంబర్ (హి.స.)
మహిళల అభ్యున్నతికి రాష్ట్ర సర్కారు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. మహిళలకు ఆర్థికంగా చేయూత అందించేందుకు ప్రభుత్వం వడ్డీలేని రుణాలను అందిస్తుందని, అర్హులైన మహిళ సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మంగళవారం మేడ్చల్ జిల్లాలోని శామీర్ పేట్ లో 3,120 మహిళా సంఘాల సభ్యులకు రూ. 2 కోట్ల 33 లక్షల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..