అర్హులందరికీ ఇండ్లు... ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హామీ
ఆదిలాబాద్, 25 నవంబర్ (హి.స.) ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని రాజురా గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ, ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయి 54 మందికి ఇంద
ఎమ్మెల్యే అనిల్ జాదవ్


ఆదిలాబాద్, 25 నవంబర్ (హి.స.) ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని రాజురా

గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ, ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయి 54 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు. అదేవిధంగా మండల మహిళ సంఘాలకు రూ. 3,03,00,000/- ల వడ్డీ లేని రుణాల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు వచ్చేలా కృషి చేస్తానని అన్నారు. ఎవరు అధైర్య పడొద్దని ఊరి బిడ్డగా అందరికి అండగా ఉంటానని తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తానని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande