ఇండస్ట్రియల్ భూముల అమ్మకంపై బీఆర్ఎస్ పోరు..
హైదరాబాద్, 25 నవంబర్ (హి.స.) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కౌన్సిల్ సమావేశం ప్రారంభానికి ముందై రభస మొదలైంది. పారిశ్రామిక వాడల భూములను అమ్మేలా రూపొందించిన పాలసీని రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు
బిఆర్ఎస్ పోరు


హైదరాబాద్, 25 నవంబర్ (హి.స.) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కౌన్సిల్ సమావేశం ప్రారంభానికి ముందై రభస మొదలైంది. పారిశ్రామిక వాడల భూములను అమ్మేలా రూపొందించిన పాలసీని రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ కార్యాలయానికి నిరసన తెలుపుతూ ర్యాలీగా వెళ్లారు. రూ.5 లక్షల కోట్ల విలువైన 9,292 ఎకరాల భూములను అమ్మేస్తూ.. రేవంత్ రెడ్డి సర్కార్ దేశంలోనే అతిపెద్ద స్కామ్కు తెరలేపిందని ఆరోపించారు. హైదరాబాద్లోలోని ఇండస్ట్రియల్ కారిడార్ భూములను అమ్ముతున్న HILTP పాలసీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande