జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది: ఎంపీ కడియం కావ్య
జనగామ, 25 నవంబర్ (హి.స.) మనందరి ప్రధాన కర్తవ్యం పేద ప్రజలకు సేవ చేయడమేనని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు, దిశ కమిటీ చైర్మన్ డాక్టర్ కడియం కావ్య అన్నారు. ఎంపీ కావ్య అధ్యక్షతన జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ''దిశా'' (జిల్లా అభివృద్ధి సహకార మరియు మాని
ఎంపీ కడియం కావ్య


జనగామ, 25 నవంబర్ (హి.స.)

మనందరి ప్రధాన కర్తవ్యం పేద ప్రజలకు సేవ చేయడమేనని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు, దిశ కమిటీ చైర్మన్ డాక్టర్ కడియం కావ్య అన్నారు.

ఎంపీ కావ్య అధ్యక్షతన జిల్లా కలెక్టరేట్ లో జరిగిన 'దిశా' (జిల్లా అభివృద్ధి సహకార మరియు మానిటరింగ్ కమిటీ) సమావేశంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్ లు పింకేష్ కుమార్, బెన్ షాలోమ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్ పాల్గొన్నారు. ముందుగా జల సంరక్షణ కై వివిధ చర్యలని చేపట్టి కేంద్రం నుంచి జిల్లా కి జల పురస్కారం వచ్చేలా కృషి చేసిన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ని ఎంపీ, శాసనసభ్యులు అభినందించారు.

అనంతరం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, విద్య, వైద్యం, ఆరోగ్యం, జాతీయ రహదారుల విభాగం, రోడ్ల భవనాలు, తదితర శాఖల ద్వారా జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల పురోగతి ని క్షుణ్ణంగా సమీక్షించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande