మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! డోర్నకల్ ఎమ్మెల్యే
మహబూబాబాద్, 25 నవంబర్ (హి.స.) మహిళా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అని ప్రభుత్వవిప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ అన్నారు. డోర్నకల్ మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ చేయడం జరిగిందన్నారు. కురవి, కందికొండ
డోర్నకల్ ఎమ్మెల్యే


మహబూబాబాద్, 25 నవంబర్ (హి.స.)

మహిళా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

అని ప్రభుత్వవిప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ అన్నారు. డోర్నకల్ మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ చేయడం జరిగిందన్నారు. కురవి, కందికొండ, చింతపల్లి, కురవి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం, ఇందిరా మహిళల చీరల పంపిణీ కార్యక్రమాలకు ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళల ఆర్థిక అభివృద్ధి, సంక్షేమం కోసం స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలతో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande